Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఇటీవల మిడ్జిల్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలకు గురై చికిత్స అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటు న్నారు. విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం బాధితులను పరామ ర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం వారికి రూ.20 వేలు ఆర్థికసాయం అందజేశారు. నాయకులు యాదయ్య, మల్లేష్, సుల్తాన్, అభిలాష్ గౌడ్, రాఘవేందర్, బాల్ చెన్నయ్య, పరంధాములు, చెన్నకేశవులు, రవి, సాయి పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం
తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెన్నంపల్లి గ్రామానికి చెందిన బి.కృష్ణయ్య అనారోగ్యంతో బాధపడుతు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ సీఎల్ సంగీత శ్రీనివాస్ యాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి తనవంతు తక్షణ సాయంగా రూ.3 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో వెంకటయ్య, కృష్ణయ్య, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.