Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్నగర్
ఎన్ని ప్రమాదాలు జరిగినా మున్సిపల్ పాలకవర్గం పట్టీ పట్టనట్టుగా ఉందని, ఇంకా ఎన్ని ప్రాణాలుపోతే మున్సిపాలిటీ యంత్రాంగం నిద్ర మేలుకొంటుందోనని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ మున్సిపాలిటీలో బుధవారం డ్రయినేజీ కాలువలో పడి దుర్మరణం పాలైన వలస కార్మికుడు నిసార్ ఏడాదిన్నర కుమారుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశీలించారు. వీర్లపల్లి శంకర్ నిసార్ కుటుంబానికి పదివేల ఆర్థిక సాయాన్ని అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలకవర్గం మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఘోరం గా విఫలమైందని, అధికారులు ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని ఆగ్ర హం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పాలక వర్గానికి అధికారులకు అక్రమ సంపాదనపై ఉన్న ధ్యాస తప్ప మరొకటి లేదని ఆరోపించారు. కొత్త ఇంటి నిర్మాణాలు చేపడితే చాలు అక్కడికి వెళ్లి డబ్బులు దండుకుంటున్న మున్సిపాలిటీ పాలకవర్గం, కౌన్సిలర్లు ఇలాంటి ఘటనలు చూసి సిగ్గుపడాలని విమర్శించా రు. మున్సిపాలిటీలో ఇప్పటికే ఎన్నో ఘటనలు చో టుచేసుకున్నాయని దీనికి నైతిక బాధ్యత మున్సిపాలిటీ అధికారులు, పాలక వర్గం వహించాలని డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ యజమానులు వెళ్లడానికి తవ్వి న గుంతలు ఈ ఘటనకు కారణమని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు వెనకా డబోమని హెచ్చరించారు. ఇంతకు మునుపే చటాన్ పల్లి రైల్వే గేట్ వద్దము న్సిపాలిటీ నిర్లక్ష్యంతో కార్మికులు చనిపో యారని, ఆ తర్వాత సోలిపూర్ వద్ద మున్సిపాలిటీ తీయిం చిన గుంతల్లోపడి ముగ్గురు బాలురు మరణించారని, తాజా గా ఈ ఘటన చోటు చేసుకుందని ఇదంతా మున్సి పాలిటీ నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, పీసీసీ మెం బర్ బాబర్ఖాన్, అందే మోహన్, ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, నందిగామ శంకర్, అందే శ్రీకాంత్, తుపాకుల శేఖర్, హాజిపల్లి సుదర్శన్, అప్పారెడ్డి గూడ సీతారాం, రాహుఫ్, మంకాల శ్రీశైలం, లింగారెడ్డి గూడా అశోక్, శివ, నర్సింలు, గంగ మౌని సత్త య్య, మల్లేష్, గండ్రాతి సాయి, రాజు పాల్గొన్నారు.