Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు చంద్రలింగం ముదిరాజ్
- కుల్కచర్ల ముదిరాజ్ సంఘం నూతన గ్రామ కమిటీ కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ- కుల్కచర్ల
ముదిరాజులందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగి నప్పుడే ఏదైనా సాధించగలమని కుల్కచర్ల మండల ముది రాజ్ సంఘం అధ్యక్షులు చెలిమిళ్ళ చంద్ర లింగం ముది రాజ్ అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని విజయచంద్ర ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ సంఘం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నీరటి కర్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేపల తిరుపతయ్య, ఉపా ధ్యక్షులుగా చాపల పెంటయ్య, చిన్న బాలయ్య, కాటన్ బా బు, శవుకు పెంటయ్య, ప్రధాన కార్యదర్శిగా గుడాల రమేష్, కోశాధికారిగా కోడిగి మల్లేష్, సోషల్ మీడియా కన్వీనర్లుగా వరంగల్ నరసింహులు, మడియకాడి భగత్ కుమార్, శవుకు శ్రీనివాస్, కార్యదర్శులుగా మల్లె పల్లి చిన్నయ్య, పగిడాల రాములు, జెల్ల బాలరాజ్, కాటన్పల్లి మహేష్, సలహాదారులుగా ఎంపీటీసీ ఆనందం, ఉరడి చంద్రయ్య, పిట్ల బాలయ్య, కాటన్పల్లి అంజిలయ్య, ఉరడి వెంకటయ్య, బోరకొండ నర్సింలు, ఏపూరి నర్సింలు, వార్వాల అంజిలయ్య, నరసింహులు, చాపల నరసింహులులను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ముదిరాజులంద రూ రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ సలహాలు సూచనలు అందించాలన్నారు. ముది రాజ్ అందరిని ఏక తాటి తీసుకువచ్చేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం పలువురిని ఘనంగా సత్క రించారు. కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ అధ్యక్షులు రామస్వామి, సల హాదారులు, హనుమంతు ఆర్టీసీ, గాదె మహిపాల్, బిఎస్ ఆంజనేయులు, మండల ప్రధాన కార్య దర్శి శ్రీనివాస్, కార్యదర్శి లక్ష్మణ్, భీమయ్య, కాటనపల్లి మహిపాల్, గాదె వెంకటేష్, జెల్ల నర్సింలు, కేశవులు, బోర కొండ సత్యం తదితరులు పాల్గొన్నారు.