Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రత్యేక స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో భాగం గా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు వగ్గు మహే ష్, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి మల్లెపోగు మల్లేష్ తదిత రులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని కోరుతూ సమావేశానికి హాజరై నాగర్ కర్నూల్ పార్లమెం టు సభ్యులు పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్, ఎంపీపీ నేనావత్ అనిత విజరు, జెడ్పీటీసీ నేనావత్ అనురాధ పత్య నాయక్ తదితరులకు వినతిపత్రాలతో పాటు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు గతంలో చేసిన తీర్మాన కాపీలను అందజేశారు. ఈ మేరకు ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీపీ అనిత విజరు, జెడ్పీటీసీ అనురాధ పత్య నాయక్, వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం సభ్యు లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి కావలసిన ప్రత్యేక స్థలా న్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పం చ్లు, ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులతో పాటు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు హఫీజ్, రంజిత్, రమేష్, అశోక్, బద్రి, మహేష్, శంకర్, రాజు, నరేందర్ నాయక్, జితేందర్, సురేష్, జేఏసీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.