Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో మరుగుదొడ్ల నిర్మాణాలు
- అనుమతి లేకపోవడంతోనే తొలగించాం :ఈఓ శ్రీనివాస్
నవతెలంగాణ చేవెళ్ల
చేవెళ్లలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో దాతల సహాయంతో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణంపై పంచాయితీ నెలకొంది. ఈ పంచాయతీ పోలీసులకు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల ఫిిర్యాదు వరకు వెళ్లటంతో శనివారం ఎండోమెంట్ అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. చేవెళ్లలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఆలయానికి వచ్చే భక్తుల కోసం మరుగు దొడ్ల నిర్మాణం ఉండాలని ప్రస్తుతం ఆయ్యప్ప మాల ధరించిన స్వాములు దాతల సహాయంతో ఖాళీ స్థలంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించి, నిర్మాణ పనులు చేపట్టారు. దీనిపై చేవెళ్లకు చెందిన కవాడి ఆరుణమ్మ, శ్రీధర్‌రెడ్డిలు అభ్యంతరం తెలిపారు. ఎండోమెంట్ నుంచి ఎలాంటి అలాంట్మెంట్ లేకుండానే ఎలా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని ఈ మరుగుదొడ్లు కట్టే పక్కనే తమ సొంత భూమి ప్లాటు ఉందని అభ్యంతరం వ్యక్తం చూస్తూ ఎండోమెంట్ కార్యాలయంలో, రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిిర్యాదు చేశారు. దీనిపై ఎండోమెంట్ అధికారి ఈవో శ్రీనివాస్ నిర్మాణం చేపట్టిన బెస్మిట్లను శనివారం రాత్రి కూల్చివేశారు. ఏలాంటి అనుమతులు లేకపోవటంతోనే వీటిని తొల గించామని ఈఓ శ్రీనివాస్ తెలిపారు. మరుగుదొడ్లు కావాలంటే అనుమతి తీసుకుని నిర్మించాల్సి ఉంటుందని అనుమంతికావాలంటే ఇప్పిస్తామని దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ నిర్మాణాలు తమ స్వప్రయోజనాల కోసం కాదు : అయ్యప్ప మాల ధరించిన స్వాములు
అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్న అయ్యప్పమాల ధరించిన స్వాములు దీనిని ఖండించారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణాలు తమ స్వప్రయోజనాల కోసం కాదని ఆలయానికి వచ్చే భక్తులకు ఉపయోగపడు తుందన్నారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ఈ మరుగుదొడ్ల నిర్మాణాలు చేసేందుకు దాతల సహాయంతో ఖాళీస్థలంలో నిర్మిస్తున్నామన్నారు. అందరూ సహకరి స్తున్నారనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. కానీ కొందరూ పనిగట్టుకుని దీనిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ , ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. ఎండోమెంట్ అధికారులకు కూడా దీని నిర్మాణం కోసం అనుమతి కోరుతామని చెప్పారు. అయితే నిర్మాణాలకు అనుమతి డబ్బులు వచ్చే వరకు ఆలస్యమవుతుందని దాతల సహాయంతో నిర్మించే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కావాలనే రాజకీయం చేస్తూ పోలీసులకు, అధికారులకు ఫిిర్యాదు చేస్తున్నారని అన్నారు. దీనిపై ప్రజలు, అధికారులు ఆలోచించాలని కోరారు. ఫిర్యాదు దారుడు దేవర శ్రీధర్ రెడ్డి అన్ని నిబంధనలను పాటించకుండా తన వ్యాపారాలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.