Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీవాసుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మున్సిపల్‌గా ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు అండర్ డ్రయినేజీ వ్యవస్థ, రోడ్లు, తాగునీటి వసతి, వీధి దీపాల సౌకర్యాలు 2వ వార్డులో కల్పించడంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనీ,కాలనీని సందర్శించిన ఎమ్మెల్యే యాదయ్యకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వివేకానంద నగర్‌కాలనీ వాసులు మాట్లాడుతూ 'తమకు ఇక్కడ ఓట్లు లేవా? లేక మేము స్థానికులం కాదా, తమ వార్డులో మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు విన్నవించుకన్నా, నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాకుండా ఇంటి టాక్సులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కానీ కాలనీని అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. కాలనీలో విచ్ఛల విడిగా పందులు తిరుగుతూ, ఏకంగా ఇండ్ల మధ్య సంచరిస్తూ, చిన్నారులను గాయ పరుస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ఇన్ని సమస్యలుంటే మీరు ఏం చేస్తున్నారని అధికా రులను నిలదీశారు. వెంటనే పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని వారిని హెచ్చ రించారు.అంతేకాకుండా ఈ కాలనీకు చెందిన సైడ్ డ్రైన్స్, అంతర్గత రోడ్ల నిర్మాణ విషయంలో వెంటనే పనులు జరిగేలా చర్యలు తీసుకుంటానని కాలనీ వాసులకు హామీ నిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మిప్రవీణ్, వైస్ చైర్మెన్ బీ.వెంకట్ రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జానేశ్వర్, పీఏసీసీ చైర్మెన్ బీ.శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు ఉన్నారు.