Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవన్నగారి మల్లారెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణ ఉద్యమంలో టీయూ టీఎఫ్ కీలక పాత్ర పోషించిందని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవన్న గారి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కందవాడ, గుండాల, దేవుని ఎర్రవల్లి, ఊరెళ్ళ, ఆలూరు ఉన్నత పాఠశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యవాద సంఘమైన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నుంచి విడిపోయి తెలంగాణ సాధనకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్స్ టీయూ టీఎఫ్ స్థాపించి స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషి చేసినట్టు తెలిపారు. తనను ఉపా ధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపిస్తే దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూల్స్‌కు శాశ్వత పరిష్కారం, సీపీఎస్ రద్దు, పదోన్నతులు తదితర సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.ఉపాధ్యాయులందరి హృదయాల్లో సంతోషాన్ని నింపే బాధ్యత వహిస్తానని,తనకు అధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థి దేవన్నగారి మల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రఘునందన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి ఎండీ. మునీర్ పాషా, చేవెళ్ల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దయానందం, శివానందం, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.