Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటోలకు సైడ్ స్వీట్లు తొలగించాలి
- ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు రూరల్
పరిమితికి మించి ప్రయాణి కులను ఎక్కించుకోవద్దని కరణ్‌కోట ఎస్ఐ మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం గౌతాపూర్ చెక్‌పోస్టు వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహనా కార్య క్రమాన్ని నిర్వహిం చారు.ఈ సంద ర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పరి మితికి మించి ప్రయాణికులను ఎక్కించుకో వద్దన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఆటోలకు సైడ్‌లో ఏర్పాటు చేసిన సీట్లను వెంటనే తొలగిం చాలని తెలిపారు. ఇష్టానుసారంగా ప్రయాణికులను ఎక్కించుకుని ఇబ్బందులకు గురిచేసే, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమ నిబంధనలకు అనుగుణంగా ఆటో లను నడుచు కోవాలన్నారు. అంతే కాకుండా లైసెన్స్, ఇన్సూరెన్స్ పొల్యూషన్ పత్రాలు ప్రతి వాహన దారుల వెంటనే తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిబంధనలు పాటించకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతు న్నాయనీ, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలన్నారు.