Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, శాసన సభ్యులు అరికెపూడి గాంధీ ,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
గచ్చిబౌలి డివిజన్లో అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని హుడా కాలనీ లో రూ.3 కోట్ల 20 లక్షల అంచనా వ్యయంతో థీమ్ పార్క్ అభివృద్ధి పనులకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి , ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ కలిసి శనివారం శంకుస్థాపన చేశారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ నల్లగండ్ల హుడా కాలనీ నివసించే ప్రజలకు ఈ థీమ్ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని, కుటుంబ సమేతంగా సేద తీరేలా థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తునట్టు చెప్పారు. యువత కోసం జిమ్, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పార్కు సుంధరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ప్రజలకిచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రతి బస్తీలలో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రతీ బస్తీ, కాలనీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నా మన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో గచ్చిబౌలి డివిజన్ అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీ వాసులు,స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.