Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 నెలలు గడుస్తున్నా పెంచిన జీతాలు ఇవ్వకపోవడం దారుణం
- కార్మికుల సమస్యలు పట్టించుకోకుంటే సమ్మెను ఉధృతం చేస్తాం
- కార్మిక సంఘం నాయకులు
నవతెలంగాణ-తాండూరు
పెంచిన జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తాండూరు పట్టణ కేంద్రంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని ఏఐటీయూసీ, మున్సిపల్ స్టాప్, ఔట్సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సంఘం నాయకులు మాట్లా డుతూ.. మున్సిపల్ కార్మికులకు 16 నెలలుగా పెంచిన జీతాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. తాండూరు మున్సిపల్లో 215 మంది కార్మికులకు పెంచిన వేతనాలు రా కపోవడంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు.. పెంచిన జీతాలు ఇవ్వాలని పలుమార్లు అధికా రులను కోరిన పట్టించుకోవడం లేదన్నారు. 11వ పిఆర్సిని అమలు చేయాలంటూ కార్మికులు అధికారులకు వినతి పత్రాలను కూడా అందజేశారని అన్నారు. రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ లలో కార్మికులకు 11వ పిఆర్సి అమలు చేస్తున్న తాండూరు మున్సిపల్లో అమలు చేయక పోవ డం సరైన పద్ధతి కాదన్నారు. తాండూరు అధికారులు కా వాలంటూ కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాండూర్ మున్సిపల్లో ఉన్నత అధికారుల తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకుంటే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు గోరెప్ప, ప్రధాన కార్యదర్శి గోపాల్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.