Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన రైతులు
నవతెలంగాణ-షాద్నగర్
కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దని కొందుర్గు మండల పరిధిలోని రాంచంద్రపురం, పులుసు మామిడి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు షాద్ నగర్ నుండి పరిగి వెళ్లే రహదారిపై వాహనాలను ఆపి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా రైతులు మాట్లా డుతూ తమగ్రామాల వద్ద కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రజాభిప్రాయ సేకరణలో తమకు తెలిసిందని, ప్రజాభిప్రాయ సేకరణలో తాము పూర్తిగా వ్యతిరేకిం చామని, అయినా బలవంతంగా ఇక్కడ పరిశ్రమను ఏర్పా టు చేసే ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. కాలుష్య కారక పరిశ్రమల వల్ల పంటలు పండక రైతన్నలు నష్టపో తున్నారని, కాలుష్యం బారిన పడి మనుషులకే కాక మూగ జీవులు కూడా మృత్యువాత పడుతున్నాయ్యాని తమ సమస్య లను వివరించారు. కార్యక్రమంలో దర్గా వెంక టేష్, రెడ్డి నరసింహులు, దర్గా నర్సింలు, శ్రీనివాస్, చిన్న య్య, సత్యనారాయణ, భాస్కర్ గౌడ్, నర్సింలు, రవి గౌడ్, మల్లేష్, జహంగీర్, శివ, మైపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మానయ్య, రామచంద్రయ్య, నర్సింలు, ఎల్లయ్య, జంగ య్య, నర్సింహారెడ్డి, రాములు, శ్రీశైలం, గణేష్ తది తరులు పాల్గొన్నారు.