Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో 15వ ఆర్థిక సంవత్సరం నిధుల నుంచి నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను శనివారం కౌన్సిలర్ నేనావత్ సోనా జైరామ్ నాయక్తో కలిసి మున్సిపల్ చైర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి హాజరై మాట్లాడారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను నాణ్యతగా చేపట్టాలని సూచించారు. అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాను ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోరటి జ్యోతి నర్సింహ, బైకని యాదమ్మ శ్రీశైలం యాదవ్, చెక్కల లక్ష్మణ్, చెన్నకేశవులు, తల్లోజు విజరు కృష్ణ, ఎంపీటీసీ సభ్యులు దోనాదుల కుమార్, నాయకులు చుక్క నిరంజన్ గౌడ్, ఆస్పత్రి హెచ్ఈఓ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.