Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ జహాంగీర్
నవతెలంగాణ-చేవెళ్ల
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయం అని ఊరెళ్ళ గ్రామ సర్పంచ్ జహాంగీర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో శనివారం యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే స్వచ్ఛంద సంస్థ వారిచే విద్యార్థులకు ఎకరుప దుస్తులతో పాటు, షూ, టై బెల్ట్, బ్యాగ్, నోటు పుస్తాకాలు, మాస్క్, శానిటైజర్ స్టేషనరి వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లా డుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమని వారిని కొనియాడారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే సంస్థ వారు పాఠశాలకు పెయింటింగ్ వేయిం చారని, చిన్న చిన్న మరమ్మత్తులు కూడా నిర్వహిం చారని గుర్తు చేశారు.అనంతరం యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ప్రతినిధి సయ్యద్ ఆరిఫుద్దిన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు కావాల్సిన సదు పాయాలన్నీ కల్పించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామ న్నారు. విద్యార్థులు మాత్రం బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తాము నిరంతరం శ్రమించడానికి సిద్దంగా ఉన్నామని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత చాలా ఉందని, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అందించే సహాయం వల్ల అది తీరుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థ వారు అందించే సహాయ సహాకారాలు వెలకట్టలేనివని, పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలుపుతూ స్వచ్చంద సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, మహమ్మద్ అక్బర్, శ్రీశైలం, చాముండేశ్వరి, నర్మద, భాగ్యలక్ష్మి, శ్రీలత, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ తహురా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.