Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంకర్‌పల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-శంకర్పల్లి
బస్సులు సమయానికి అనుగుణంగా నడపాలని ఎస్ఎఫ్ఐ శంకర్పల్లి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. అరుణ్‌కుమార్, శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం శంకర్పల్లి మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్సుల సమస్యల పరిష్కరించాలని రాస్తారోకో నిర్వహించి, ధర్నా చేపట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు.అందులో భాగంగానే విద్యార్థుల అనుగుణంగా పాఠశాలలు, కళాశాలలు సమయానికి అనుగుణంగా బస్సులు నడపడం లేదన్నారు.చేవెళ్ల డివిజన్లో కరోనా కంటే ముందు, అనేక బస్సులు నడిచేవని, కానీ ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు లాభపేక్ష ధ్యేయంగా బస్సులు నడుపుతున్నారని దీంతో చాలా గ్రామాలకు బస్సులు బందు చేసినట్టు చెప్పారు.కరోనా కంటే ముందు నడిచే అన్ని పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన విద్యాశాఖ మంత్రి ఉన్నా కూడా విద్యార్థులకు ప్రయోజనం లేదన్నారు. అనంతరం హైదరాబాద్ టు డిపో మేనేజర్, మెహిదీపట్నం డిపో మేనేజర్లు రెండు రోజులలో బస్సులన్నీ నడుపుతామని హామీనివ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు అల్లి దేవేందర్, శంకర్పల్లి మండల ఎస్ఎఫ్ఐ వివిధ కళాశాలల అధ్యక్ష, కార్యదర్శులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.