Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి
నవతెలంగాణ-చందానగర్
చందానగర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని వేమన వికర్ సేక్షేన్ కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులను పలకరిచారు. కాలనీలో చేపట్టిన డ్రయినేజీ పనులను పరిశీలించారు. కాలనీలో జరగాల్సిన అభివృద్ధి పనులపై కాలనీవాసులతో చర్చించారు. కాలనీలో మరికొన్ని రోడ్లు, డ్రయినేజీ పనులు, నీటి సమస్య వంటి పలు సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు ఆమెను కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, నాయకులు నరేందర్ భల్లా, కొండల్‌రెడ్డి, అమిత్ దూబే, అవినాష్, సందీప్ రెడ్డి, కాలనీవాసులు రమేష్, మల్లేష్, అనిల్, కృష్ణవేణి, జ్యోతిరెడ్డి, ఉపేందర్, వెంకటేష్, రాము, తదితరులు పాల్గొన్నారు.