Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చదువుతున్న విద్యా ర్థులు, పరిశోధకులు మానసిక సంఘర్షణలను ప్రతీకాత్మ కంగా వర్ణించిన నవల నవీన్ రచించిన అంపశయ్య అనీ, ఈ నవల తర్వాత ఆయన ఇదే ఇంటి పేరుగా కూడా మారిపోయిందని హెచ్‌సీయూ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. వారం రోజులుగా విద్యార్థులు వివిధ బృందాలుగా ఏర్పడి ఒక్క అంపశయ్య నవల పైనే ఒక్కొక్కరు అనేక కోణాల్లో పత్రాలను సమర్పించే కార్యక్రమం ముగింపు సమావేశాన్ని సోమ వారం నిర్వహించారు. 'అంపశయ్య నవల-విద్యార్థి సద స్సు' నుంచి విద్యార్థులే ఒక్కోసమావేశానికీ అధ్యక్షులు, సమావేశ కర్తలు గా వ్యవహరించగా, ప్రతి సమావేశానికీ ముఖ్యఅతిథిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొని, చివరిలో వాటిని సమీక్షించారు. ప్రతి బృందానికి ఒక్కో సాహితీవేత్త పేరు పెట్టుకున్నారు. మొల్ల, దాశరథి, విశ్వనాథ, గుర్రం జాషువ, కాళోజీ, శ్రీశ్రీ, చలం, సినారె, రంగనాయకమ్మ, ఓల్గా మొదలైన పేర్లతో ఈ సదస్సు సమావేశాలకు పేర్లు పెట్టుకున్నారు. విద్యార్థుల్లో పఠనా సక్తినీ, వక్తత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు సమయపాలన, సమిష్టిగా పనిచేయడం వంటి అనేక లక్షణాలు ఈ సదస్సు ద్వారా నేర్చుకున్నామని విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జ్ఞాన ప్రగతి, మాధురి, అంబదాస్, శ్యామ్ సుందర్, సాయిసురేశ్, అనిల్‌కుమార్, నరేశ్, ప్రశాంత్, నౌషీన్, అరుణ్, సంధ్య, నరునాయక్, గో పి, అఖిల, రఘురాం, శ్రీనివాస్, సరళ, రామకృష్ణ, తదితరు లు, వివిధ సమావేశాలకు అధ్యక్షులు, సమావేశకర్తలుగా వ్యవహరించారు.