Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాట్ల కోసం ఔత్సాహికులు ఎదురుచూపులు
- రెండో దఫా వేలంలో అందుబాటులో ఉన్న 14 ప్లాట్లు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఔటర్ రింగ్ రోడ్డు లోపల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ గ్రామం పరిధి తుర్కయంజాల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీిఏ) లేఅవుట్‌కు సోమవారం జరిగిన ప్రి బిడ్ సమావేశం విజయవంతమైం ది. తుర్కయంజాల్‌లో రెండవ దఫా హెచ్ఎండిఏ 14 ప్లాట్ లను ఈ-అక్షన్ ద్వారా అమ్మకాలు జరుపనుంది. తుర్కయంజాల్ లేఅవుట్ సైట్ వద్ద ప్రి బిడ్ సమావేశాన్ని హెచ్ఎండీఏ అధికారులు నిర్వహించారు.
ప్రీబిడ్ సమావేశానికి దాదాపు 100 మందికి పైగా ఆసక్తిగల ఔత్సాహికులు హాజరయ్యారు. ఇప్పటికే ఒకసారి తుర్కయంజాల్ హెచ్ఎండీఏ లే అవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు, కొత్తగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కలిగిన వారు శనివారం నాటి ఫ్రీ బిడ్ సమావేశానికి హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టీసీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తుర్కయంజాల్ లేఅవుట్ ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ గంగాధర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్(సిపిఓ), సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఇ) యూసఫ్ హుస్సేన్, తుర్కయంజాల్ లేఅవుట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)దన్ మోహన్‌సింగ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డిఈఈ)గౌతమ్, అకౌంట్స్ ఆఫీసర్(డిఎఓ) విజరు కుమార్, తదితరులు హాజరయ్యారు.