Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
సీఎం కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారని ఎంపీపీ పటేల్ విజరుకుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డిలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని దౌల్తాబాద్ పెద్దచెరువు లో 3లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్య కారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి భరోసాను కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ ఏడీ చరితరెడ్డి, సర్పంచ్ శిరీష రమేష్, ఎంపీటీసీ శివమ్మ, చేపల పెంపకందారులు, తదితరులు పాల్గొన్నారు.