Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
పత్రికారంగ భీష్మాచార్యులు గోవర్ధన సుందర వరదాచార్యులు అని పత్రికా రంగ ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళా వేదికపై సోమవారం విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ నిర్వహణ ఇటీవల మరణించిన వరదా చారి సంతాప సభ జరిగింది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య టి. కిషన్‌రావు అధ్యక్షత వహించిన సభలో ముఖ్య అతిధిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత, నిజాయితీలే పెట్టుబడిగా వరదా చారి ఏభై దశాబ్దాలు పత్రికా రంగంలో విలువల కోసం పరితపించిన కర్మ యోగి అన్నారు. ఆచార్య కిషన్‌రావు మాట్లాడుతూ వర్ధమాన జర్నలిస్ట్‌లకు మార్గదర్శనంలో ఉత్తమ శిక్షణ ఇచ్చారని కొనియాడారు. గోవింద రాజుల చక్రధర్ మాట్లాడుతూ పత్రికా రంగంలో విబ్భిన్న పర్శ్వాలను సృజించిన వరదాచారి అనుభవాలు నేటి వారికి పాఠ్య అంశాలు అన్నారు. ఆచార్య సుధీర్ కుమార్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. వేదికపై ఈనాడు సంపాదకుడు నాగేశ్వరరావు, విశాలాంధ్ర సంపాదకుడు రామరావు, పత్రికా ప్రముఖులు వల్లీశ్వర్, శంకరనారాయణ, కె.రామచంద్రమూర్తి, తదితరులు మాట్లాడారు.