Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
అన్నవరం దేవేందర్ రచించిన సమగ్ర కవితల సంకలనాలు తెలంగాణా భాష పరిమళాలు అని ఆ సాహిత్యం భాషా పరిశోధకులకు ఉపయుక్తమని తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. రవీంద్రభారతిలోని సాహిత్య అకాడమీ కార్యాలయంలో అన్నవరం దేవేందర్ 1988 నుంచి 2022 వరకు రచించిన రెండు సమగ్ర కవితా సంకలనాలు గౌరీ శంకర్ అవిష్కరించి మాట్లాడారు. నలభై ఏళ్ల పాటు దేవేందర్ తెలంగాణ సమాజాన్ని సన్నిహితంగా చూసి అక్షర బద్ధం చేసారని వివరించారు. తెలంగాణ మలి ఉద్యమంకు దేవేందర్ కవితలు ప్రేరణ ఇచ్చాయని అభినందించారు. కార్యక్రమంలో కాళోజీ అవార్డ్ గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సాహితీవేత్త కె.పీ.అశోక్ కుమార్ పాల్గొన్నారు.