Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా సంఘాలు వివరాలు డిజిటలైజ్డ్
- రుణాలు, రుణ చెల్లింపులు ఆన్లైన్లోనే.. మొబైల్ ఫోన్‌కి వివరాలు
- ఎస్‌హెచ్‌జీ డిజిటలైజేషన్లో దేశంలోనే తొలి రాష్ట్రం తెలంగాణ
- రంగారెడ్డి జిల్లాలో వంద శాతం డిజిటలైజేషన్
ప్రపంచ డిజిటల్ రంగం దుసుకుపోతున్న తరుణంలో మహిళాలు కూడా డిజిటల్ రంగంలో రాణించాలన్న ఉద్దేశంతో ఎస్‌హెచ్‌జీ ( సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) సభ్యుల వివరాలు ఆన్లైన్ రూపంలో పొద్దు పరిచేందుకు ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల వివరాలు ఆన్లైన్ చేసేందుకు నిర్ణయం తీసుకుం ది. మహిళా సంఘాలు పూర్తి వివరాలను డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చారు. రుణాలు తీసుకోవా లన్న, రుణాలు చెల్లించాలన్న అంత ఆన్లైన్లో జరుగుతుంది. సభ్యుల ఫోన్ నెంబర్‌కి ఎప్పటికప్పుడు.. తమ లోను వివరాలు అప్డేట్ అవుతాయి. రుణం చెల్లించే తేదీ, చెల్లించాల్సిన డబ్బుల వివరాలు నేరుగా మహిళలు తమ మొబైల్లో చుసూకునే అవకాశం ఉంది. జిల్లాలో వంద శాతం మహిళ సంఘాలు డిజిటల్ రూపంలోకి వచ్చాయి.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం మహిళా సంఘాలు డిజిటల్ రూపంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 19,151 సంఘాలు ఉండగా, అందులోని 2,10, 561 మంది సభ్యుల వివరాలు, లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోకి మారాయి. దీనిని రియల్ టైం బుక్ కీపింగ్ పిలవను న్నారు. మహిళా సంఘాలన్నింటినీ డిజిటలైజ్డ్ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణలో సంఘాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. మహిళా స్వ యం సహాయక సంఘ సభ్యుల వ్యక్తిగత వివరాలతోపాటు, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఆర్థిక వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. దీని ద్వారా సంఘాల నిర్వహణలో పూర్తి పారదర్శకత రానున్నది. ఇప్పటివరకు పుస్తకాలలో రాస్తున్న వివరాలన్నింటినీ ఇకపై పూర్తిస్థాయి లో మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తారు. ఒక సంఘంలోని ఒకరికి దీని నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. వారి ఫోన్ నంబర్‌ను సెంట్రల్ సర్వర్‌లో నమోదు చేశారు. ఆ నంబర్ నుంచి యాప్ కార్యకలాపాలు నిర్వహించే అవ కాశం ఉంటుంది. ఈ యాప్‌పై మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చారు.
వివరాలన్నీ నమోదు..
రుణం మొత్తం చెల్లించగానే వివరాలను, వారి ఫొటోలతో సహా వివరాలు ఇందులో అప్డేట్ అవుతాయి. వివరాలు యాప్‌లో పొందుపర్చారు. సభ్యురాలు గతంలో బ్యాంకు రుణాల మొత్తాన్ని సంఘంలో ఎప్పుడు చేర్చారు. ఎంత మొత్తం సంఘం అధ్యక్షురాలు, కార్యదర్శికి పొదుపు చేశారు. బ్యాంకు రుణం మొత్తం వారు వెంటనే బ్యాంకుకు చెల్లించకపోవడం, అప్పు ఎప్పుడు తీసుకున్నారు. తిరిగి ఎం త డబ్బు జమ చేశారు, ఏ రోజు చెల్లించారు, ఇంకా సొంత అవసరాలకు వాడుకున్న సందర్భాలు, ఎంత మొత్తం చెల్లించాల్సి ఉన్నది, తదితర వివరాలు కూడా ఉన్నాయి. ఈ మొబైల్లో తమ పరిధిలో వ్యాపారం కోసం తీసుకున్న లోన్ల వివరాలు, సంఘాల సమాచారాన్ని సీసీలు యాప్‌లో ఆప్ లోడ్ చేస్తున్నారు. ఈ యాప్‌లో ఎస్‌హెచ్‌జీల సమగ్ర సమాచారం ఆన్లైన్లో పూర్తి వివరాలతో లభ్యం అవుతుంది.