Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్
- కాపుగడ్డ, ఇంద్రారెడ్డి కాలనీలో బస్తీ దవాఖానాలు
నవతెలంగాణ - శంషాబాద్
ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బస్తీ దవాఖానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం శంషాబాద్ లోని కాపుగడ్డ డ్వాక్రా సంఘ భవనంలో బస్తీ దవాఖాన , 14 వార్డు ఇంద్రా రెడ్డి కాలనీలో బస్తీ దవాఖానాతో పాటు చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్‌ను శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కే.సుష్మ మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్యాదవ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ దవాఖానాల ఏర్పా టుతో ఆ బస్తీలో ఉండే ప్రజలకు సత్వర వైద్యం అందుతుం దన్నారు. ప్రభుత్వ వైద్యులు బస్తీ దవాఖానాలకు వచ్చే వారందరికీ వీలైనంత మేరకు మెరుగైన వైద్యం అందించా లని సూచించారు. మందులు ఇతర వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందు లు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో ప్రారంభించిన బస్తీ దవాఖనా లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ఆరోగ్యం ఉల్లాసం కోసం ఏర్పాటుచేసిన ఓపెన్ పార్క్ జీమ్‌లను వినియోగించుకోవాలని సూచించారు. వైస్ చైర్మన్ బండి గోపాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో 14వ వార్డులను ఇంద్రారెడ్డి కాలనీలో బస్తి దవాఖానా ఓపెన్ పార్క్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్హె చ్ఓ వెంకటేశ్వర రావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ సృజన, కౌన్సిలర్లు ఇ.అజరు, ఎండీ జహంగీర్ ఖాన్, మేకల వెంక టేష్ముదిరాజ్, అమృతసుధాకర్రెడ్డి, ఆర్. రేఖగణేష్గుప్తా, నార్సింగి వ్యవసాయ కమిటీ చైర్మన్ దూడల వెంకటేశ్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్యశ్రీ, బస్తీ దవాఖాన జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వినోద్, బస్తీ దవాఖాన ఎంఓ డాక్టర్ పృథ్వీ సాయి, సిహెచ్ఓ స య్యద్ ఎజాజ్, హెల్త్ ఎడ్యుకేటర్ బలరాం, ఏస్యుఓ శ్రీని వాస్ నాయకులు పి.శ్రీనివాస్‌గౌడ్, పి.ప్రవీణ్‌గౌడ్, రఫీ, ఎస్.కృష్ణముదిరాజ్, ఆర్.సురేష్, వి.హనుమంత్, ఆర్.రా జు, తదితరులు పాల్గొన్నారు.