Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యత లేని పనులతో ప్రజాధనం వృథా
- బీజేపీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ కృష్ణగౌడ్
నవతెలంగాణ-తాండూరు
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన భారత్ మాల రోడ్డు పరివార్ యోజన కింద తాండూరు పట్టణంలో జరుగు తున్న రోడ్డు పనులు అధ్వానంగా కొనసా గుతున్నాయని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ కృష్ణగౌడ్ తెలిపారు. సోమవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడారు.. తాండూర్ బస్టాండ్ నుంచి శివాజీ చౌక్ మార్గంలో చేస్తున్న రోడ్డు పనులు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయన్నారు. దీంతో ప్రజాధనం దుర్వినియో గం అవుతుందన్నారు. మూడు శబ్దాబ్దాల క్రితమే ఈ రోడ్డు నిర్మాణానికి అంచనాలు తయారు చేసినప్పటికీ నరేంద్ర మో డీ ప్రభుత్వం ఇప్పుడు నిధులు కేటాయించిందన్నారు. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేస్తున్నాడని అన్నారు. 30 ఏండ్ల క్రితం చేసిన రో డ్డు డివైడర్ పూర్తిగా శిథిలం అయినప్పటికీ దాన్ని తొలగిం చకుండా మీడియం రైలింగ్‌పై పూతగా సిమెంటు ప్లాస్టింగ్ చేయడం పనులు నాణ్యత లోపంగా ఉన్నాయన్నారు. వారం రోజుల ఇందిరా చౌక్ నుంచి బస్టాం డ్ వరకు జరుగుతున్న రోడ్డు పనులు నిబంధనల మేరకు జరగడం లేద న్నారు. మూడు నెలల క్రితమే వేసిన రోడ్డుపై మళ్లీ పైపూతగా తారు వేయటం ఏమిటనీ ఆయన ప్రశ్నిం చారు. రోడ్డును తవ్వి నాణ్యతగా వేయాల్సిన కాంట్రాక్టర్ నాణ్యత పాటించడం లేదన్నారు. ఈ అక్ర మాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఎండగడ తామని తెలిపారు. నేషనల్ హైవే అధికారులకు, క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నా రు. టెండర్ దక్కించుకున్న కాంటాక్ట్‌ను బెదిరించి స్థానిక నాయకులు ఆ పనులు నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులను స్థానిక అధికార పార్టీ నాయకులు పర్యవేక్షిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ నాయకుల మాటలకు బెదిరింపులకు భయపడి నాసిరకంగా పనులు చేస్తే నష్టపోయేది కేవలం కాంట్రాక్టర్ మాత్రమే అన్నారు. నాసిరక రోడ్డు పనులతో స్థానిక ప్రజలు నరకయాతన భరించడం తప్పదు అన్నారు. నాణ్యత లోపంగా జరుగుతున్న పనులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.