Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్
సంక్షేమ పథకాలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదా పూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతినగర్ డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణలక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్దిదారులకు ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడ అమలు కానీ సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరే టర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రెడ్డి, మాజీ కౌన్సి లర్లు మోహన్‌గౌడ్, విరేశంగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, చం దానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్‌రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్గౌతమ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు జనార్దన్‌రెడ్డి, ప్రసాద్, కర్ణాకర్‌గౌడ్, కాజా, సీతారాం కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.