Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీల భూమిని కబ్జా చేయాలని చూస్తున్న యాదవులు
- జపాల్ ఎస్సీ మాదిగ కాలనీ వాసులు
నవతెలంగాణ-మంచాల
ఎస్సీ మాదిగ కాలనీ వాసులు భూమిలో యాదవ భావన నిర్మాణం అనుమతి ఇవ్వోద్దని జపాల్ ఎస్పీ మాదిగ కాలనీ వాసులు అన్నారు. గురువారం మండల పరిధి లోని జపాల గ్రామంలో ఎస్సీ మాదిగ కాలనీ వాసులు తమ భూమిలో కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 96 సర్వే నంబర్లో ప్రభుత్వం తమకు 22 గుంటల భూమిని ఇచ్చిందని, ఈ భూమిలో తాత, ముత్తాతల కాలం నుండి కబ్జాలో ఉంటు సుమారు 80 కుటుంబాలు వివిధ రకాల పంటలు పండిస్తు జీవనం కొనసాగిస్తున్నామని వారన్నారు. ఎవరూ లేని సమయం లో యాదవ సంఘం వారు యాదవ సంఘం భవనం నిర్మాణం చేయడం కోసం దౌర్జ్యనంతో ఆ భూమిని జేసీబీ లతో చదును చేయించారన్నారు. ఈ విషయంపై తహ సీల్దార్ ఫీర్యాదు చేశారని తెలిపారు. సంబంధిత అధికా రులు వెంటనే స్పందించి యాదవ భవన్ నిర్మాణాని అను మతి ఇవ్వకూడదని కోరారు.