Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం పిలుపు
నవతెలంగాణ-మియాపూర్
ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరా డాలని ఆటో కార్మికులకు పిలుపునిచ్చిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకటేశం ఆటో వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా రెండో మహాసభ శేర్లింగంపల్లిలోని కాన మెట్టు ప్రాంతంలో రక్తం నాగేష్గౌడ్ భవనంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేశం పాల్గొని ఆటో కార్మికు లను ఉద్దేశించి ప్రసంగించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా కొన్ని కార్మిక చట్టాలను సాధించామని తెలిపారు. పోరాడి సాధించుకు న్న ఆటో కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య మాట్లా డుతూ జిల్లాలో ఆటో కార్మికులతో పాటు అసంఘ టిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన వారు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహించాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చా రు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి పర్వ తాలు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ షాప్లో పనిచేసే కార్మికులు అసం ఘటిత రంగంలో పనిచేసే హమాలీలు వేలాది మంది కార్మికులు ఈ జిల్లాలో ఉన్నారని వారందరినీ కూడ గట్టి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయ న పిలుపునిచ్చారు. మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర సమి తి సభ్యులు కే రామస్వామి, జిల్లా కార్యదర్శిలు చందు యా దవ్, జైపాల్ రెడ్డి, ఎస్ మల్లేష్, ఏఐటీయూసీ జిల్లా కార్య వర్గ సభ్యుడు రామకృష్ణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్య దర్శి ప్రభు, లింగం ఆటో యూనియన్ నాయకులు నరేంద ర్, కృష్ణ, బుగ్గ రాములు, మహేష్ తదితరులు పాల్గొ న్నారు.
నూతన కమిటీ ఎన్నిక
కమిటీ అధ్యక్షునిగా బుగ్గ రాములు ప్రధాన కార్య దర్శిగా కే చందు యాదవ్ వీరితోపాటు ఆఫీస్ బేరర్స్ 13 మంది కమిటీ సభ్యులు 21 మందితో నూతన ఆటో యూ నియన్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఏర్పడిందని కే చందు యాదవ్ తెలిపారు.