Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య
నవతెలంగాణ-దోమ
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండో మహా సభలు కొడంగల్ మండలం కేంద్రంలో 2022 నవంబర్ 22-23న రెండు రోజులు నిర్వహించారు. మొదటి రోజు ర్యాలీ, బహిరంగ సభ, రెండో రోజు ప్రతిని ధుల సభ జరుగుతుంది. మహాసభలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవు తారు. మహాసభను జయప్రదం చేయాలని నేడు వ్యవసా య కార్మిక సంఘం దోమ మండల కమిటి ఆధ్వర్యంలో దోమ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య మాట్లాడుతూ వికారా బాద్ జిల్లాలో నిరంతరం వ్యవసాయ కార్మికులు పేదలు, రైతుల భూ సమస్యలు, అర్హులైన పేదలకు ఇండ్లు స్థలాలు ఇవ్వాలని, పోడు భూమి సమస్యలు, ఉపాధి హామీ చట్టా న్ని పటిష్టంగా అమలు చేయాలని, డబుల్ బెడ్రూం, రైతురుణ మాఫీ వంటి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నిరంతరం సంఘం పోరాటం నిర్వహిస్తున్నదని అన్నారు. వ్య.కా.సంఘం మాహాసభలు మొట్ట మొదటిసారిగా కొడం గల్ పట్టణంలో నిర్వహిస్తామని భవిష్యత్తులో పాటు వికా రాబాద్ జిల్లాలో పేదలు, కూలీల సమస్యల పైన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, హామీలను అమలు చేసేం తవరకూ ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెంచేవిధంగా ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకా విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వ్య.కార్మిక సంఘం మండల అధ్యక్షులు కార్యదర్శులు హెచ్. సత్యయ్య, రఘురామ్, శేఖర్, శ్రీను పాల్గొన్నారు.