Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శుల సర్దుబాటు ఇష్టానుసారం
- ఉతర్వులు లేకుండానే బదిలీలు
- ఓ గ్రామంలో పోస్టింగ్ మరో గ్రామంలో విధులు డిప్యూటేషన్లకు తిలోదకాలు
- ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండానే మార్పులు
- ఎంపీడీఓ స్థాయిలోనే నిర్ణయాలు
- ఇ.పట్నంలో ఇద్దరు కార్యదర్శుల మార్పు
- పట్టించుకోని జిల్లా అధికారులు
ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మారిపో తున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాలు లేకుండానే మార్చేస్తున్నారు. పోస్టింగ్ ఒక గ్రామమైతే, విధులు మరో గ్రామంలో నిర్వహిస్తున్నారు. అందుకు జిల్లా పంచాయతీ అధికారి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ మార్పులు కొనసాగుతున్నాయి. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బదిలీ చేస్తున్నట్టు ఆర్డర్ లేకుండానే ఇష్టం వచ్చినట్టు మార్పులు, చేర్పులు చేసుకుంటున్నారు. ఇదంతా ఎంపీడీఓ స్థాయిలోనే కానిచ్చేస్తున్నారు. ఈ విధంగా ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల విషయంలో చోటు చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం మండలంలో ఇటీవల చోటు చేసుకుంది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండలంలో పంచాయతీ కార్యదర్శు ల బదిలీల విషయంలో మండల అధికా రులు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పంచాయతీ కార్యదర్శులను ఒక ఊరు నుంచి మరో ఊరికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులను సైతం మండల స్థాయి అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పో చారం గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి విక్టోరియాని ముకునూరు గ్రామపంచాయతీకి అధికారికం గా ఇటీవల బదిలీ చేశారు. ఇక్కడ పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి తిరుమలరావు అనారోగ్యం కారణాల రీత్యా మెడికల్ లీవ్‌లో ఉన్నారు. అయితే అప్పటి వరకు ఫరూక్ నగర్ మండలం మోగిలిగిద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి చిట్టమయ్యని ముకునూరుకు డిప్యూటేషన్‌పైన బదిలీ చేశారు. అయితే సదరు పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీంప ట్నం మండలంలోని రిపోర్ట్ చేశారు. వెంటనే ము కునూర్ గ్రామపంచాయతీలో రిపోర్ట్ చేసి విధులు నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్‌పై ముక్కునూరుకు వచ్చిన చిట్టమయ్యని అనధికారికంగా మరో గ్రామానికి మార్పిడి చేసేందుకు మండల స్థాయి అధికారులు కనీస నిబంధనల పాపాటిం చలేదు. పోచారం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న విక్టోరియాను ముకునూరుకు పంపి ఇక్కడ డిప్యూటేషన్‌పై వచ్చిన చిట్టమయ్యను పోచారానికి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో కనీస నిబంధనలు పాటించలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ మార్పిడి చేయాలంటే జిల్లా పంచాయతీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని అందుకు సంబంధించిన నిఖితపూర్వ కమైన ఆదేశాలు తీసుకోవాల్సిన తర్వాతనే పంచాయతీ కా ర్యదర్శులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాం టి సర్దుబాటు ఉత్తర్వులు లేకుండానే పోచారం గ్రామానికి బదిలీ చేశారు. వీరిరువురికి ఇప్పటి వరకు ఎలాంటి బదిలీ ఉత్తర్వులు మాత్రం అధికారికంగా రాలేదు. ఎంపీడీవో స్థాయిలోనే వీరి బదిలీ తతంగం ముగిసినట్టు తెలుస్తుంది. జిల్లా పంచాయతీ అధికారికి మౌఖికంగా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే జిల్లా స్థాయి అధికారి నుంచి ఇరువురి సర్దుబాటుకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. సరికదా మీరు ఆయా గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఉత్తర్వులు లేకుండానే విధులు...
ఫరూక్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి చిట్టమ య్యను ఇటీవలే ఇబ్రహీంపట్నం మండలం ముకునూరు పంచాయతీకి డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ ఉత్తరంలో జారీ చేశారు. కొద్ది రోజులు ముకునూరు గ్రామంలో విధులు నిర్వర్తించిన చిట్టమయ్యను అకస్మాత్తుగా పోచారం గ్రామపంచాయతీకి మండల స్థాయి అధికారులు మార్పిడి చేశారు. అక్కడ పని చేస్తున్న విక్టోరియను ముకునూర్ గ్రామ పంచాయతీ మార్చి విధులు నిర్వర్తించే విధంగా చూస్తున్నారు. కానీ ఈ సర్దుబాటు చేయడంలో జిల్లా స్థాయి పంచాయతీ అధికా రుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు మాత్రం అందలేదు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఇరువురు జనన, మరణాల ధ్రువీకరణ పత్రాల నమోదుతో పాటు పలు రిపోర్టులపై సంతకాలు కూడా చేస్తున్నారు. ఉత్తర్వులు లేకుండా ఇలాం టి వివిధ నిర్వహించడం పట్ల భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
చేర్పులు మార్పులు సబబేనా...?
జిల్లా స్థాయి నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకుండా పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో స్థాయిలోనే ఇలా చేర్పులు, మార్పులు చేయడం సబబేనా? అన్న అనుమానా లు వ్యక్తం అవుతున్నాయి. సుమారు రెండు మాసాల నుంచి ఇరువురి ఆయా పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న వీరికి జిల్లా పంచాయతీ అధికారుల నుంచి ఎందుకు బదిలీ ఉత్తర్వులు రాకపోవడం గమనర్హం. ఈ తర్దుబాటు విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు ఆలోచించాల్సి ఉంది. అయితే జిల్లా పంచాయతీ అనుమతి లేకుండా మం డల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు బదిలీ చేయడం ఎంపీడీవో స్థాయి అధికారులకు అధికారం ఉందా? జిల్లా పంచాయతీ అధికారుల అనుమతి అవసరం లేదా? అన్నది పంచాయతీ విభాగానికే తెలియాలి.