Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలి
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సీహెచ్ జంగయ్య
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోగా ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు పాతి గుడిసెలు వేసుకున్న పేద లను, వారికి మద్దతు ఇచ్చిన సీపీఐ(ఎం) నాయకులను అక్రమ అరెస్టులు చేయడం దారుణమని ఇబ్రహీంపట్నం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జంగయ్య అన్నారు. కందు కూరులో అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని 18 రోజులుగా ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 588లో గల భూమిలో ఇండ్లు లేని పేదలు వేసుకున్న గుడిసెలను తొల గించి, అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ ఇబ్రహీం పట్నంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరి కీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 రోజులుగా కందుకూరులో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 588లో భూమిలో ఇండ్లు లేని పేదలందరూ సీపీఐ(ఎం) అధ్యర్యంలో గుడిసెలు వేసుకుంటే ఎందుకు తొలగిస్తున్నా రని ప్రశించారు. అర్హులైన పేదలకు ఇవ్వాలని, వారి ఆందో ళనకు మద్దతు ఇస్తున్న సీపీఐ(ఎం) నాయకులను అక్రమం గా అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. ఓ వైపు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి మాట తప్పింద న్నారు. పేదలకు 60 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నదని విమర్శించారు. కానీ వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ తమ కబంధహస్తాల్లోకి తీసుకొని అక్రమ నిర్మాణాలను నిర్మిస్తున్న రామోజీరావు వంటి బడా నేతలపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. వారు నిర్మిస్తున్న ఇండ్లను ఎందుకు తొలగించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభు త్వానికి పెద్దలపై ఉన్న శ్రద్ధ పేదలపై లేదని విమర్శించా రు. ప్రభుత్వ అధికారులకు వారు చేసిన కబ్జాలు, నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వారిపై కేసులు నమోదు చేయకుండా ఎందుకు మీనమే షాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. పేదలంటే ప్రభుత్వాని కి అలుసైందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి.నర్సింహా, మున్సిపల్ కార్యదర్శి ఎల్లేశ, నాయకులు శంకర్, యాదగిరి, విజరు, జంగయ్య, తరంగ్, శ్రీకాంత్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.