Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్యలేవీ
- రెవెన్యూ అధికారులకు పెద్దల భూ ఆక్రమణలు కనిపించడం లేదా?
- జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి
- అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
- సీపీఐ (ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్ డిమాండ్
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పేదలు ఇంటి జాగాల కోసం వేసుకున్న గూడిసెలు ను కూల్చడం అన్యాయమని, అర్హులైన పేదలందరికీ ఇంటి జాగాలు ఇవ్వాలని సీపీఐ (ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె. భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మా ట్లాడారు.. ప్రభుత్వం పేదలకు ఇంటి జాగాల కోసం కేటా యించిన జాగాలో పేదలు వేసుకున్న గూడిసెలును ప్రభు త్వం కూల్చడం ఎంతో వరకు సబబు అని ప్రశ్నించారు. పేదలను పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ (ఎం) ఖండిస్తోందన్నారు. 2007లో ఆనాటి ప్రభుత్వం స్థానిక ప్రజలకు ఇంటిస్తాలాల పట్టాలు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ స్థలం చూపు కుండా జాప్యం చేయడంతో ఏండ్ల తరబడి ఓపికతో వేచి చుసిన ప్రజలు సంబంధిత ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. అలాంటి పేదలపై యుద్ధం ప్రకటించిన తీరున గురువారం తెల్లవారుజా మున వం దల మంది పోలీసు బలగాలతో ప్రజ లపై దాడిచేసి గుడిసెలను కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో రెవెన్యూ అధికారుల అందండలతో భూకబ్జాదారు లు వందల ఎకరాల భూములని కంకర్యం చేశారు, అలాం టి భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు అలాంటి చర్యలు చేపడు తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అండదండలు కలిగిన పెద్దలకు నిషేధిత భూములని సైతం జిల్లా కలెక్టర్ కట్టాబెడుతు న్నారని పేర్కొన్నారు. కానీ పేదలపై దాష్టికన్ని ప్రయోగిస్తు న్నారని, దీనికి కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీర్పేట్లో భూ ఖబ్జా దారులకు మద్ధతుగా తహసీల్దార్ ఏక పక్షాన, రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్కి విరుద్ధ్దంగా చేసిన పంచానామని రద్దు చేయమంటే కలెక్టర్ నిరాకరించాడని తెలిపారు. కోర్టు ఆ పంచానమాను తప్పు అని చెప్పి ఆ కేసును డిస్మిస్ చేసిందని గుర్తు చేశారు. ఇలాంటివి అనేక భూ కబ్జాలని బహిరంగంగా బయటపెడ తామని, వారిపై కూడా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకుంటా రా అని ప్రశ్నించారు. జిల్లాలో ప్రభుత్వం ఇప్పటివరకే ఇండ్ల పెట్టాలిచ్చిన వారికి, ఇంటి స్థలాలు లేని పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ఆందోళనలని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.