Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం(ఐ) జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-గండిపేట్
నగర శివారులో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూ ములను కాపాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు డి.జగదీష్ డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ(ఎం), కెవీపీస్, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో గండిపేట్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ.. నార్సింగి మున్సిపల్లోని మంచిరేవుల గ్రామంలో దళితుల శ్మశానవాటిక స్థలం, ప్రభుత్వ భూములు, పార్క్‌లను కబ్జా చేసిన వారిపై0 చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే నంబర్ 30లో దళితులకు చెందిన శ్మశాన వాటిక అన్యాక్రాంతం అవుతుందని ఆరోపిం చారు. పార్కును పార్టు 2గా చేసి గతంలో గ్రామ పంచా యతీకి రిజిస్టేషన్ చేసి ఇచ్చినట్టు తెలిపారు. కానీ దళితుల కు చెందకుండ బాడాబాబులు, స్థానిక రాజకీయ నాయకు లు బిల్డర్లకు వత్తాసు పలుకుతున్నట్టు తెలిపారు. మూసి పరిహారక ప్రాంతాన్ని బప్పర్ జోన్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాన్ని బిల్డర్లు ఆక్రమించుకుంటున్నట్టు చెప్పారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంత రం డిప్యూటీ తహసీల్దార్ జంగయ్యకు వినతిపత్రాన్ని అం దజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, రుద్ర కుమార్, అశోక్, పద్మారావ్, శ్యామ్, శ్రీకాంత్, బంటీ, దే వా, పవన్‌కుమార్, సురేష్, నరసింహా, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.