Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కొప్పు సుకన్య భాష
- పలు గ్రామాల్లో ధాన్యం కేంద్రాలు ప్రారంభం
నవతెలంగాణ-యాచారం
రైతులంతా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కొప్పు సుకన్య భాష సూచించారు. గురువారం యాచారం మండల పరిధిలోని యాచారం, నందివనపర్తి చింతపట్ల, మంతన్ గౌరెల్లిల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలన్నారు. ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చెర్మన్ కారింగ్ యాదయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు జోగిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్, ఏపీఎం సతీష్, సర్పంచ్‌లు ఉదయశ్రీ, శ్రీధర్‌రెడ్డి, సరితా, ఎంపీటీసీ లక్ష్మమ్మ, డైరెక్టర్లు మల్లారెడ్డి, స్వరూప, మధుకర్‌రెడ్డి, నరేందర్, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.