Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
హాస్య అవధానంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శంకర నారాయణ ఛందోబద్ద పద్య రచన లోనూ దిట్ట అని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ కొనియాడారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై గురువారం శ్రీ త్యాగరాయ గాన సభ నిర్వ్యహణలో శంకరనారాయణ రచించిన నరసింహ స్వామి శతకం అవిష్కరణ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా ఆచార్య ఇనాక్ పాల్గొన్ని సంపుటిని అవిస్కరించారు. అనం తరం వారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో శతక పద్య ప్రక్రియ విశిష్టమైనదని అన్నారు. శంకర నారాయణ ఛందస్సు పాటిం చటమె కాక భావం, భక్తిలను అర్థవంతంగా వ్యక్తం చేశారని వివరించారు. శంకర నారాయణ తన సంపుటిని లాంఛనంగా న్యాయవాది తోట శ్రీ లక్ష్మికి అంకిత మిచ్చారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి అధ్యక్షత వహించిన వేదిక పై, కవి జల్ది విద్యాధర రావు, వై.ఎస్.ఆర్ మూర్తి, కె.వీ.రావు తదితరులు పాల్గొన్నారు.