Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూర్ రూరల్
తాండూరు మండలం గౌతపూర్ గ్రామంలో శుక్రవారం నుంచి మంగళవారం వరకు కొనసాగే మల్లికార్జున స్వామి ఆలయంలో దేవత మూర్తులు, ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతుంది. భూకైలాస్ వ్యవస్థాపకులు వాసు పవర్ నాయక్, నందీశ్వరుడు, భ్రమరాంబిక, వినాయకుడి విగ్రహాలతో ధ్వజస్థంభం తోపాటు, ఉత్సవాల నిర్వాహణ కోసం రూ. 50 వేలు నగదు విరాళంగా ఇచ్చారు గురువారం ధ్వజస్తంభం విగ్రహాలు గ్రామానికి రావడంతో ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు కొనసాగుతున్నట్టు నిర్వహకులు వెల్లడించారు. విరాళంగా ఇచ్చిన వాసు పవర్ నాయక్‌ను గ్రామ సర్పంచ్ రాజప్పగౌడ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల పురం అధ్యక్షులు నరేందర్ రెడ్డి, తాండూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ మహిళా కన్వీనర్ శకుంతలతోపాటు గ్రామ పెద్దలు, గ్రామ స్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పత్తి చంద్రప్ప, గ్రామస్తులు రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.