Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ రవిగౌడ్
నవతెలంగాణ-కొడంగల్
అనుమతి లేకుండా డీజేలు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ రవిగౌడ్ అన్నారు. ఏఎస్ఐ అనుమతులు లేకుండా డీజే పెట్టొద్దనందుకు నానా హంగామా సృష్టించిన నారాయణపేటకు చెందిన వినోద్గౌడ్పై, డీజే యజమానిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడంగల్ పట్టణం వడ్డెర బస్తీలో ఎలాంటి అనుమతి లేకుండా డీజే సౌండ్ బాక్స్ పెట్టి కొంతమంది డాన్స్ చేస్తుండగా, గురువారం రాత్రి ఏఎస్ఐ, కానిస్టేబుల్‌తో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా,డీజే సౌండ్ పర్మిషన్ తీసుకున్నారా అని ఏఎస్ఐ అడగగా నారాయణపేటకు చెందిన వినోద్ గౌడ్ అనే వ్యక్తి దుర్భషలాడుతూ నానా హంగామా సృష్టించి డీజేను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా అడ్డుకున్నట్టు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా డీజే పెట్టినందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్తుండగా అడ్డుకున్న వినోద్ గౌడ్, శ్రీలక్ష్మి డీజేె సౌండ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి,డీజేను సీజ్ చేసినట్టు తెలిపారు. అనుమతులు లేకుండా డీజే సౌండ్ పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.