Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-బషీరాబాద్
మండల కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. గురువారం శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో తాండూరు నియోజకవర్గంలో మహిళల ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడంలోనూ ఒక విజన్‌తో ముందుకు సాగుతున్నామన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి విరివిగా రుణాలను మంజూరు చేయిస్తూ ఇప్పటికే వారి అభ్యున్నతికి దోహదపడుతున్నానని చెప్పారు. ఇప్పుడు బషీరాబాద్ మండల కేంద్రంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశానని వెల్లడించారు. మహిళలు స్వావలంబన దిశగా అడుగులు వేయాలనే ఓ సదాశయంతో ఈ సెంటర్‌ను ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రాంతంలోని మహిళలు స్వయంశక్తితో ఎదగాలని, కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలనేదే తన విజన్ అని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శకుంతల, పార్టీ మండల ప్రెసిడెంట్ రామునాయక్, బషీరాబాద్ ఎంపీటీసీ రేఖాపవన్ఠాకూర్, ఏఎంసీ వైస్ చైర్మైన్ రవీంధర్సింగ్ తన్వార్, పీఏసీఎస్ చైర్మైన్ వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ రాజిరెడ్డి, కో-అప్షన్ మెంబర్ రజాక్, పాల్గొన్నారు.