Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్య చెల్లిపై కన్నేసిన బావ
- భార్య ఉండగానే పెండ్లి చేసుకోవాలంటూ మరదలిపై ఒత్తిడి
- తిరస్కరించడంతో ఆమెపై కత్తితో దాడి
- కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘటన
- నిందితుడు కిషన్‌నాయక్‌ను అదుపులో తీసుకున్న పోలీసులు
నవతెలంగాణ-కేశంపేట
కట్టుకున్న భార్య ఉన్నప్పటికీ ఆ మానవ మృగం కామా వాంఛ తీరలేదు. తన భార్య సొంత చెల్లిపైనే కన్నేెశాడు. ఆమెను ఎలాగైనా లొంగ దీసుకుని పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయమై మరదలిని నిత్యం వేధించ సాగాడు. బావ శేష్టలతో కంగుతిన్న మరదలు అతన్ని తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో అతడిని పెండ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. దీంతో మరదలిపై కోపం పెంచుకున్న ఆ వ్యక్తి ఆమెపై అతి కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె పనిచేసే ఆస్పత్రికి వెళ్లి మరీ ఆమెపై కత్తితో దాడి చేసి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గురువారం జరిగింది.
ఎస్ఐ ధనుంజయ కథనం ప్రకారం మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన అనిత అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని (ఏఎన్ఎం)గా కేశంపేట ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తోంది. అనిత వాళ్ల అక్క భర్త కిషన్‌నాయక్ చాలా కాలంగా తనని పెండ్లి చేసుకోవాలని ఆమెను వేదిస్తున్నాడు. పెండ్లికి అనిత నిరాకరించింది. దీంతో ఆమెపై కిషన్‌నాయక్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమం లోనే గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కిషన్‌నాయక్ అనిత పనిచేసే ఆస్పత్రికి వచ్చాడు. మరదలిపై ఉన్న కోపంతో ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ పెనుగులాటలో ఆమె చేతి వేళ్లకు తీవ్ర గాయాల య్యాయి. ఇదంతా ఆస్పత్రిలోని సీసీటీవీ పుటేజీలో రికార్డు అయింది. వైద్య సిబ్బంది పోలీసులు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ధనుంజయ తెలిపారు.