Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపొందించేందుకు వీలుగా మన ఊరు - మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కరుణ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవ సేనలతో కలిసి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అద నపు కలెక్టర్లతో మన ఊరు - మన బడి పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో మంజూరీ తెలి పిన మొత్తం 464 పాఠశాలల్లోనూ గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రతి మండలానికి 2 చొప్పున మోడల్ స్కూల్స్ 27 మండలాల్లో 57 మోడల్ స్కూల్స్ అందులో 18 పాఠశాలల్లో అన్ని పనులు పూర్తి అయినవని తెలిపారు. మిగతా పాఠశాలల్లో డిసెంబర్ చివరి నాటికి పెయింటింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్సులో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, ఈఈ పిఆర్ సురేష్ చంద్రరెడ్డి, డీఈలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ ప్రతినిధి: 'మన ఊరు-మన బడి' పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.'మన ఊరు-మనబడి' కార్యక్రమం పనుల పురోగతిపై గురువారం టీఎస్ఈడబ్ల్యూ, ఐడీసీ చైర్మెన్ రావుల శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేనలతో కలి సి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ, తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు అలసత్వం వహించకుండా పిల్ల లకు మంచి విద్యను అందించి ఉన్నతంగా తీర్చి దిద్దాలన్నారు. చదువుల్లో వెనుకబడి ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, చదవడం, రాయడంతో పాటు వారి అభి వృద్ధికి కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో పురోగతి కని పించాలని, నోడల్ అధికారులు ఎప్పటికప్పుడూ పాఠశా లలను సందర్శించి, పురోగతిని పరిశీలించాలని తెలిపారు. పిల్లలు ప్రతి రోజూ పాఠశాలకు వచ్చే విధంగా చూడా లన్నారు. చదువుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థుల తలి ్లదండ్రులను సంప్రదించి వారి పురోగతికి కృషి చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక దేవి, విద్యా శాఖ అధికారులు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.