Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా రెడ్డి అంజిరెడ్డి
- విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే చేప ట్టాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి కోరారు. పత్రికా సంపాదకులు పున్రెడ్డి వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తారి రాజిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు కరుణాకర్‌తో కలిసి మం త్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చూపుతున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. 'మన ఊరు-మనబడి' కార్యక్రమం ద్వారా ఇన్నాళ్లు ఆదరణకు నోచుకోని ప్రభుత్వ పాఠశాలల మరమ్మతు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని చెప్పారు. విద్యార్థులకు సకల వసతులు కల్పి స్తున్నారని చెప్పారు. ఈ తరుణంలో ఉపాధ్యాయుల సమస్యలు సైతం తక్షణ పరీక్షరించేందుకు చొరవ చూపాలని మంత్రిని కోరారు. ఉపాధ్యాయుల బదిలీ లు, ప్రమోషన్లు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనీ ఖాళీల కొరతను నివారించేందుకు ఉపాధ్యాయులు నియమించాలని కోరారు.