Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్
- ప్రజా సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-మియాపూర్
ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం శేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ప్రజా సమస్యలను పక్కాకు పెట్టాయని అన్నారు. శేర్లింగంపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభు త్వ భూములను వేలం వేయడం, భూ బకాసురులకు అంట గట్టడం, కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అమ్మేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నదని ఆరోపించారు. పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు లేక దరఖాస్తులు చేసుకుంటే ప ట్టించుకోవడం లేదన్నారు. డబుల్ బెడ్రూంలు ఇవ్వకపోగా 75 గజాలు స్థలం ఉన్న వారికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరం అన్నా రు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 58 క్రింద తమ ఇండ్లను రెగ్యురేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారులు ఇప్పటికీ దానిపైన రియాక్ట్ చేసి అర్హులైన వారందరికీ రెగ్యులేషన్ చేయకపోవడం బాధాకర మన్నారు. 50 ఏండ్లుగా మియాపూర్ సర్వేనెంబర్ 28లో నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్న శ్రమజీవులంతా కనీస సౌకర్యాల కోసం తమ ఇండ్లను చట్టబద్ధత కోసం పోరా డుతున్నారని అన్నారు. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు నాటకీయంగా సీఆర్పీఎఫ్ వారికి అట్టి స్థలంలో కొంత భాగాన్ని కేటాయించి ప్రజల మీద సీఆర్పీఎఫ్ బలగాలతో తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని అన్నారు. సీి ఆర్పీఎఫ్ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. వీటిని నివారించమని స్థానిక రెవెన్యూ అధికారు లను కోరితే నిమ్మకు నేరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే టీఆర్ఎస్ నాయకులకే దళితబంధు ఇవ్వడం సరికాదన్నారు. అర్హులందరికీ దళితబంధు ఇవ్వాల న్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, కార్యదర్శివర్గ సభ్యు లు పల్లె మురళి, అంగడి పుష్ప, కర్ర దానయ్య, ఇ.దశరత్ నాయక్, కమిటీ సభ్యురాలు బి.విమల, రంగస్వామి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కుంభం సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు తాండ్ర కళావతి, వై.రాంబాబు, లక్ష్మీనరసింహ, లలిత, సుశీల, సావిత్రి, ఎం. రాణి, జి.లావణ్య, ధారాలక్ష్మి, పుష్పలత, సుల్తానా బేగం, రజియా బేగం, భూసాని రవి, డప్పు రాజు, నిమ్మక నాగభూషణం, దేపూరి శ్రీనివాసు లు, నర్సింగ్, ఈసాక్, ఖాదర్ వలీ, మోతే సంతోష్, సురేష్ నాయక్, శ్రీను, పరశురాము, హుస్సేన్ ఇతరులు పాల్గొన్నారు.