Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాట్ల క్రయ విక్రయాలు ఆన్లైన్లో కనిపించాలి
- ఒకే భూమిపై క్రయ, విక్రయదారులకు రైతుబంధు
- నివారించకపోతే ప్రభుత్వానికి కోట్లలో నష్టం
- సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు బూడిద రామ్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ధరణి పోర్టల్ లో రైతుల వివరాలు పొందు పరిచిన విధంగా లేఅవుట్ల క్రయవిక్రయదారుల వివరాలను పొందుపరచాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు బూడిద రామ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన రెవెన్యూ చట్టం రాకముందు భూమి కొనుగోలు చేసిన రియల్ ఎస్టే ట్ వ్యాపారులు ఎలాంటి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండానే వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయించారని చెప్పారు. కానీ ఆ భూమి ల్యాండ్ కన్వెన్షన్ చేయకపోవడం వల్ల విక్రయించిన రైతుతో పాటు కొనుగోలు చేసి ప్లాట్లుగా విక్రయించిన వ్యా పారులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయ్యాయని చెప్పారు. ఒకే భూమిపై ఆ ఇద్దరికీ రైతుబంధు డబ్బులు వస్తున్నాయని గుర్తు చేశారు. అందుకు ప్రధాన కారణం ధరణిలో రైతు భూమి వివరాల మాదిరిగా ప్లాట్లుగా చేసి క్రయవిక్రయాలు జరిపిన వివరాలు ఆన్లైన్లో పొందుప రచకపోవడం వలన ప్రభుత్వ ఆదాయానికి గండి పడు తుందన్నారు. ధరణి పోర్టల్‌లో వివరాలు పొందు పరిచినట్టే లేఅవుట్లలో లేఅవుట్ పేరు, గామం, మండలం, జిల్లా , ప్లాట్ల యజమానుల పూర్తి వివరాలు పొందుపర్చాలన్నారు.
తదుపరి లావాదేవీలు జరిగిన వెంటనే ఆన్లైన్ కూడా ఆ వివరాలు కనిపించే విధంగా తగిన చర్యలు తీసు కోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసు కు వచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం ఎంతో ఉప యోగంగా ఉందన్నారు. నూతన చట్టం ఏర్పడిన తర్వాత ఎన్నుకోబడిన మొట్టమొదటి గ్రామ సర్పంచ్‌లు తెలంగాణ సాధనలో తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. దేశం లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అ మలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృత జ్ఞతలు తెలిపారు. శ్మశాన వాటికల అన్ని చోట్ల వినియో గంలోకి వచ్చాయన్నారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ విధిగా శ్మశాన వాటికల్లోనే అంతిమ సంస్కారాలు చేసుకునే విధంగా ఖచ్ఛితమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.