Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొంగరలో ఆగని అక్రమ నిర్మాణాలు
- గ్రామ కంఠం కబ్జా కదలని అధికారులు
- అనుమతి లేకుండానే కట్టడాలు
- పటించుకోని మున్సిపల్ అధికారులు
- అధికారులు, రాజకీయ నాయకుల ప్రోత్బలంతోనే నిర్మాణాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నిన్న అధికారులు ధ్వసం చేసిన చోటే.. మళ్లీ నిర్మా ణాలు కొనసాగుతున్నాయి. కొంగరలో అక్రమ నిర్మాణాలు మళ్ళీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గ్రామ కంఠం భూమి సైతం కబ్జాకు గురవుతోంది. ఎలాంటి అనుమ తులు తీసుకోకుండానే అధికారుల కనుసన్నల్లోనే నిర్మాణం జరుగుతున్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమంగా గ్రామ కంఠం భూమిలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను కూల్చిన, అక్కడే మళ్ళీ పది రోజుల వ్యవధిలోనే నిర్మాణం చేపడుతున్న పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఆదిభట్ల మున్సిపల్ పరిధిలో 5వ వార్డులో గ్రామ కంఠం భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణాలు కొనసాగు తున్నాయన్న సమాచారంతో మున్సిపల్ క్షేత్రస్థాయి వార్డు సిబ్బంది 15 రోజుల క్రితం అడ్డుకున్నారు. ఆ సం దర్భంగానే ఎలాంటి అనుమతులు లేవన్న పేరుతో ధ్వంసం చేశారు. అనుమతులు వచ్చిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టుకోవాలని సదరు నిర్మాణదారులకు సూచించారు. మున్సిపల్ అధికారులు సైతం అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే కట్టుకోవాలని చెప్పారు. కానీ పది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఎలాంటి అనుమతులు తీసు కోకుండానే ఆదే స్థలంలో నిర్మాణ పనులను చేపడుతున్నా రు. గతంలోనే పలు సార్లు సదరు భూమిలో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని సూచించినప్పటికీ నిర్మాణదారులు అవేమీ పట్టించుకోకుం డా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.
అందుకు మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకుల మద్దతుతోనే అక్రమ నిర్మాణాలు కొనసాగుతు న్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ మళ్ళీ కట్టడాలు కొనసాగుతున్న ఎందుకు అధికారులు పటించుకోవడం లేదో అధికారులకే తెలియాలి. అధికారు లు, రాజకీయ నాయకులకు ఐదవ వార్డులో అక్రమ నిర్మా ణాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పైగా గ్రామకంఠం కావడం అందులో ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది మీదనే వదిలేయకుండా మున్సిపల్ పాలకవర్గం ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.