Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
పోడు భూముల్లో సేద్యం చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులు హక్కు పత్రాలు పొందేందుకు అర్హులని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాల యంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ఓఎఫ్ఆర్ -2005 చట్టం ప్రకారం అర్హులైన వారికి పోడు భూముల కేటాయింపులపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ నిఖిల అధ్యక్షతన నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ... గ్రామ సభల ద్వారా పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న వారి వివరాలను సేకరిం చినట్టు తెలిపారు. అర్హత మేరకు లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఏదేని కారణాలతో దరఖాస్తులు తిరస్కరించినట్లయితే సబ్ డివిజన్ లెవెల్ కమిటీ తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను తిరిగి పరిశీలిస్తామని ఆమె తెలిపారు. ప్రతి ఒక దరఖాస్తును పరిశీలించి పారదర్శకంగా, ఉదారం గా, నిబంధనల మేరకు పోడు భూముల హక్కు పత్రాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. అటవీ ప్రాంతం సరిహద్దు బయట ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకోబోమని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధి కారి అశోక్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, కమిటీ సభ్యులు ధారూర్, కుల్కచర్ల జడ్పీ టీసీ, పెద్దముల్, బొంరాస్‌పేట్ జడ్పీటీసీ సభ్యులు సుజాత, రాందాస్‌నాయక్, మంజుల, అరుణాదేశ్ ముఖ్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.