Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా ఉంటామని కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి అన్నారు. కుల్కచర్ల మండలం ఘనపూర్‌కు నిరుపేద కుటుంబానికి చెందిన మత్స్య కార్మికుడు దండు రాములు 5 రోజుల కింద చేపలు పట్టడానికి వెళ్లి వలలో చిక్కుకుని ప్రమా దవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయన సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని నింపుతూ బాధిత కుటుంబ సభ్యులకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో పరిగి నియోజకవర్గం పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, చాపలగుడెం సర్పంచ్ లక్ష్మణ్, బీసీ సంఘం జిల్లా నాయకులు ద్యానమొని శ్రీనివాస్, సాల్వీడ్ సర్పంచ్ బాలయ్య, చైల్డ్ లైన్ మండల ఇన్చార్జి రాం చంద్రయ్య, రాములు, నరేష్, పెంటయ్య, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.