Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూరు బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డీకే..
- నాయకులను మభ్య పెట్టే ప్రయత్నం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేయొద్దు
- నియోజకవర్గ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి
నవతెలంగాణ-తాండూరు
తాండూరు నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఆదివారం బీఆర్ఎస్ నుంచి టికెట్ తనకే లభిస్తుందని అనడం హాస్యాస్పదంగా ఉం దని తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ అధికార ప్రతి నిధి పి.వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధికార ప్రతి నిధి పి.వెంకట్ రెడి,్డ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పు నహీం, నాయకులు నర్సింలు, ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. తాండూర్ నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి పట్టంకట్టి రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ పలుమార్లు సిట్టింగ్‌లకే టికెట్లు వస్తాయని చెబు తున్న తాండూరు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడం సరైన పద్ధతి కాదన్నారు. తాండూర్‌లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నాయకులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాండూర్ అభివృద్ధిని చూసి ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతుండడంతో చూసి ఓర్వలేకనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనకే టిక్కెట్ లభిస్తుందని గొప్పలు చెప్పుకుంటు న్నారని ఎద్దేవా చేశారు. మహేందర్ రెడ్డి పార్టీ మారారని ఒకవేళ మార్పే జరిగితే తాను రాజకీయాల నుంచి తప్పు కుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారన్నారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.