Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఏచ్టీయూ జిల్లా ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ దాస్
నవతెలంగాణ- బంట్వారం
సమాజంలో బాల్య వివాహాలు ప్రోత్సహించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఏచ్టీయూ జిల్లా ఇన్చార్జీ ఇన్స్పెక్టర్ వి.దాస్ అన్నారు. సోమవారం మం డల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బాల్య వివాహాల నిర్ము లనపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నేటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయని, గ్రామస్థాయి లలో అధికారులు అందరికీ సమన్వయంతో పనిచేసి బాల్య వివాహలను నిర్మూలించాలని అన్నారు. అనం తరం ధరూర్ సీఐ తిరుపతి రాజు మాట్లాడుతూ ...బా లలను లైంగిక వేధింపులకు గురిచేస్తే పీఓసీఎస్ఓ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాలలకు రక్షణ సంరక్షణ కల్పించవలసిన బాధ్యత అం దరిపై ఉందన్నారు. పిల్లలందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఎదగాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా చైల్డ్ లైన్ 1098, డయల్ 100కు ఫోన్ చేయా లని కోరారు. కార్యక్రమంలో బంట్వారం ఎస్సై ఆనంద్ కుమార్, ధరూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, ఏఏచ్ టీయు వికారాబాద్ ఇన్చార్జీ దాసు, ఇన్స్పెక్టర్, చైల్డ్ లైన్ కౌన్సిలర్ రామేశ్వర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సరళ, ఏఏచ్టీయు టీమ్ బి.గౌరీ శంకర్, రవిందర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.