Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి
- పీడీఎస్‌యూ నాయకులు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూని యర్ కళాశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిం దని పీడీఎస్ యూ నాయకులు సందీప్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాలయం దు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ ఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఉదయం కళాశాలకు వచ్చేసరికి క్లాస్ రూమ్‌లలో సిగరెట్లు, ఫాస్ట్ ఫుడ్ కవర్లు మూత్ర విసర్జన చేసి తరగతి గదులు కంపుతో ఉండటంతో విద్యార్థులు పీడీఎస్‌యూ నాయకులకు తెలి పారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరిం చి ధర్నా నిర్వహించారని తెలిపారు. కళాశాలకు సంబం ధించిన సమస్యలు జిల్లా ప్రజా ప్రతినిధులు జెడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్‌ల దృష్టికి తీసుకపోయి ఆధ్వర్యంలో విన తి పత్రాలు సమర్పించారని తెలిపారు. అయినా విద్యా ధికారులు పోలీస్ అధికారులు కళాశాలలో ఆకతాయిలను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యల పట్ల అధికారులు విద్యార్థు లకు సమస్యలు పరిష్కరించే దిశగా హామీ ఇవ్వాలని కోరా రు. ఆకతాయిలను అకృత్యాలకు కట్టడి చేయాలని కోరారు. కళాశాలకు సమయానికి రాకుండా విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పీడీఎస ్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వ హిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమం లో నాయకులు సోయబ్, ప్రకాష్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.