Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
బీపీ, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఎన్సిడి కిట్లు ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని చిన్న నందిగామ సర్పంచ్ టి.సావిత్రమ్మ అన్నారు. కొడంగల్ మండలం చిన్న నందిగామలో ఏఎన్ఎంల తో కలిసి బీపీ, షుగర్ బాధితులకు ఎన్సీడీ కిట్లను సర్పంచ్ సావిత్రమ్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీపీ షుగర్ రోగులలో మనోధైర్యం నిం పేలా సీఎం కేసీఆర్ ప్రతినెల వారికి అవసరమయ్యే మం దులు ప్రభుత్వం ఉచితంగా నేరుగా రోగి చెంతకు అందిం చడం హర్షించదగ్గ విషయమన్నారు. రోగులకు ఆర్థిక భా రం, ఆస్పత్రుల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించేలా మందు లను కిట్ల రూపంలో అందించడం సంతోషంగా ఉందన్నా రు. ఒక్కో కిట్టులో నెలకు సరిపడా మందులు అందుబా టులో పెడుతూ నిరక్షరాస్యులు సైతం తెలుసుకునేలా కిట్టు లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారన్నారు. మందులు వేసుకునే విధానం గురించి ఏఎన్ఎం కిట్టు అందిస్తూ వివ రించి చెప్పింది. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.