Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల నాయకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో మంత్రికి వినతి
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ మండల నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు కలిసి సోమవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కొన్నేం డ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నా, పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులు దూరం ప్రాంతాలక వెళ్లలేక విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు నూతన పెట్రోల్ పంపు ప్రారంభో త్సవానికి విచ్చేసిన విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రా రెడ్డికి జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గుజ్జుల మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డేవిడ్, బీజేపీ నాయకులు పద్మ అనిల్, పాండు ,ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కో కన్వీనర్ పోతుగంటి కృష్ణమాదిగ, మాజీ ఎమ్మార్పీఎస్ మండలా ధ్యక్షులు దరువుల రాజు,ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షులు కిరణ్పూలే, శేఖర్, శ్రీకాంత, పాండు, సురేష్, శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.