Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100 శాతం పూర్తి అయ్యేలా సహకరించాలి
- జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
మెదడువాపు వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సహకరించి తొమ్మిది మాసాల నుండి 15 సంవత్సరాల పిల్లలకు జేఈ వ్యాక్సినేషన్ వంద శాతం అయ్యేలా సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమా వేశ మందిరంలో మెదడువాపు వ్యాధి నియంత్రణకు సంక్షేమ శాఖల అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓలతో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 9 నెలల నుండి 15 సంవత్స రాలలోపు పిల్లలందరికీ సంబంధిత శాఖల సహకారంతో జేఈ వ్యాక్సినేషన్ వంద శాంతం పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో 1 నుండి 5 సంవత్సరాల పిల్లల వివరాలు, 6 సంవత్సరాల నుండి15 సంవత్సరాల పూర్తి వివరాలు వెంటనే అందజేయాలని కోరారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు కుడి కాలుకు, 15 సంవత్సరాలలోపు పిల్లలకు కుడి చేతి రెట్టకు టీకాలు వేయబడతాయని తెలిపారు. వ్యాక్సినేషన్ ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని, సురక్షితమైనదని తెలిపారు. ప్రతిరోజు ఒక ఏఎన్ఎం 100 మంది పిల్లలకు టీకాలు వేసే విధంగా చూడాలన్నారు. పిల్లల తల్లితం డ్రులకు జెఈ.వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యాశాఖ, ఐసీడీఎస్ శాఖలు గ్రామ పంచాయతీల వారీగా తమ పరిధిలోని పాఠశాలలో అంగన్వాడి కేంద్రాలలో ఉన్న విద్యార్థుల వివరాలను వెంటనే అందజేసి వ్యాక్సినేషన్ కోసం వైద్య శాఖకు సహకరించాలని కోరారు. అన్ని మండల కేంద్రాలలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో జేఈ వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఉప వైద్య అధికారి జీవరాజ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, వైద్యశాఖ స్టాటిస్టికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.